Vellampalli Srinivasarao: చంద్ర‌బాబు పై మంత్రి వెలంప‌ల్లి ఫైర్..

విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ విజయవాడ నగరంలో రోడ్ల అభివృద్ధి తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కౌన్సిల్లో చర్చించి ఆమోదించడం జరిగిందని చెప్పారు. అమరావతి రాజధాని పేరుతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి విషయంలో పూర్తిగా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో విజయవాడ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్పొరేటర్ ఓ మహిళా ఉద్యోగి విషయంలొ అసభ్యకరంగా మాట్లాడిన తీరు సరికాదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు తమపై ఎన్ని అసత్య ఆరోపణలు చేసిన నగర అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola