Minister Vellampalli: వంగవీటి రాధా హత్య కు రెక్కీ ఆరోపణలపై మంత్రి వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు
తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయంగా లబ్ది పొందేందుకే వంగవీటి రాధా రెక్కీ వ్యవహారాన్ని వాడుకోవాలని చూస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాధా ఆరోపణలు చేసిన వెంటనే సీఎం జగన్ స్పందించి... గన్ మెన్ లను పంపితే తిరస్కరించారన్నారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా రాధాను పరామర్శించేందుకు వెళ్లి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు ఉంటే రాధా కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లంపల్లి స్పష్టం చేశారు.