Minister Prasanth Reddy: ఎంపీ అర్వింద్ పర్యటనలో ఘటనలపై స్పందన

జగిత్యాలలో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి... త్వరలోనే జిల్లాలో CM KCR పర్యటన ఉంటుందన్నారు. జిల్లా కలెక్టరేట్, మెడికల్ కాలేజ్ ను ఆయన ప్రారంభిస్తారని తెలిపారు. ఆర్మూర్ లో ఎంపీ అర్వింద్ పర్యటనలో ఘటనలపై ఆయన స్పందించారు. పసుపు బోర్డు తెస్తానన్న హామీతో ఎంపీగా గెలిచి ఇప్పటికీ ఏమీ చేయలేదని, అందుకే రైతుల ఆగ్రహం బయటపడుతోందన్నారు. పోలీసులు రక్షణ కల్పించలేదనడం సరికాదని, పొద్దున నుంచి ఎంపీ రక్షణలోనే పోలీసులు ఉన్నారని గుర్తుచేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola