Minister Prasanth Reddy: నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై... క్షేత్రస్థాయిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్ భవనం చుట్టూ తిరుగుతూ పరిశీలించి అధికారులు, వర్క్ ఏజన్సీ, కన్సల్టెన్సీ, ఆర్కిటెక్ట్ లతో సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువులోగా సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. వర్క్ చార్ట్ ప్రకారం పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఫ్లోర్లవారీగా అంతర్గత నిర్మాణాలు జరగాలని సూచించారు. ఇప్పటిదాకా జరిగిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రార్థనా మందిరాల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.