Minister Peddireddy: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు
చంద్రబాబుకు జగన్ మెహోన్ రెడ్డి భయం పట్టుకుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో మాట్లాడిన ఆయన... స్థానిక ఎన్నికల ఫలితాలు చంద్రబాబును షాక్ కు గురి చేశాయని, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2019లో అధికారంలోకి వచ్చుంటే కుప్పం అభివృద్ధికి కలలు కన్నానని చెబుతున్న చంద్రబాబు.... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏం చేశారని ప్రశ్నించారు. కుప్పం ప్రజలు చంద్రబాబు ముసలి కన్నీరును నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు హెచ్చరికలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి.... తామూ ఈ జిల్లాలోనే పుట్టామని, మీసాలు ఉన్నాయని గుర్తుచేశారు.