Minister Peddireddy: తిరుపతిలో అమరావతి జేఏసీ సభకు వచ్చిన వారిలో రైతులు ఎవరూ లేరు
తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన సభపై మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి స్పందించారు. సభకు వచ్చిన వారిలో రైతులు ఎవరూ లేరని రియల్ ఎస్టేట్ వ్యక్తులే అన్నారు. భూములు కొన్నవ్యక్తులు...రేట్లు తగ్గిపోకూడదనే పాదయాత్ర నిర్వహించారన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లూ అమరావతి ఉద్యమాన్ని వెనకనుండి నడింపించారని ఈరోజు ఆయనే ముందుకు వచ్చి సభలో పాల్గొన్నాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కోలేకనే తోకపార్టీలన్నీ కలిసి ఇలాంటి సభలను నిర్వహిస్తున్నాయన్నారు.