Nellore Police: చాకచక్యంగా పట్టుకున్న నెల్లూరు పోలీసులు
విశాఖపట్నంకు చెందిన ఓ గజదొంగను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలో 2007నుంచి ఇతను దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడని, ఇప్పటి వరకు మొత్తం 12నేరాలు చేశాడని తెలిపారు పోలీసులు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ జీవనం గడుపుతున్న బోలా నాగసాయిని కావలి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతని వద్ద 212గ్రాముల బంగారు ఆభరణాలు 315 గ్రాముల వెండి వస్తువులు స్వాదీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం 10,30,000 రూపాయలు ఉంటుందని అంచనా.