Minister Mekapati : మేకపాటికి సమస్యలు చెప్పుకున్న స్కూల్ పిల్లలు
నెల్లూరు జిల్లా సంగం మండలంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. ఎస్సీ కాలనీలో ఉండగా.... ఆయన వద్దకు కొందరు స్కూల్ పిల్లలు వచ్చారు. జడ్పీ హైస్కూల్లో తమకు బాత్రూమ్ సౌకర్యం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మేకపాటి... స్కూల్లో సమస్యలేంటో చూద్దాం పదండంటూ వారిని తన కాన్వాయ్ లోని ఓ కారులో ఎక్కించారు. నేరుగా స్కూల్ వద్దకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వెంటనే కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం దిశగా మంత్రి వెనువెంటనే చర్యలు తీసుకోవడంపై స్కూల్ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు.