Minister KTR helps Punjab sportswoman : పంజాబ్ బధిర క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ సాయం
Continues below advertisement
పంజాబ్ బధిర చెస్ క్రీడాకారిణి మలికా హండా ఆవేదన ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరలైంది. పంజాబ్ ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని తన సైగల ద్వారా బాధను పంచుకుంది. అప్పుడే ఈ అంశంపై స్పందించిన కేటీఆర్.. తాజాగా తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మలికా హండాను ప్రత్యక్షంగా కలిసిన ఆయన... వ్యక్తిగతంగా 15లక్షల రూపాయల సాయాన్ని అందించారు. ఓ ల్యాప్ టాప్ ను కూడా ఇచ్చారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన కేటీఆర్... మలికా హండాకు ఓ ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడాలన్నారు.
Continues below advertisement