Minister KTR: మిథాని- ఒవైసీ హాస్పటల్ మధ్య ఫ్లైఓవర్ ప్రారంభం

Continues below advertisement

హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధిపై ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మిథాని - ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ల మధ్య 1.365 కి.మీ పొడవుతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు-ఎస్ఆర్డీపీ ద్వారా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం...తాజాగా మిథాని-ఒవైసీ ఫ్లై ఓవర్ ద్వారా మౌలిక వసతుల అభివృద్ధిపై మరింత వేగంగా ముందుకెళ్తోందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram