Dinesh Mongia: కాషాయం కండువా కప్పుకున్న భారత మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా బీజేపీలో చేరారు. చండీఘర్ కు చెందిన 44ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మన్ సుమారు ఏడేళ్లపాటు భారత క్రికెట్ కు తన సేవలందించారు.57 వన్డేల్లో,ఓ టీట్వంటీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన దినేష్ మోంగియా...కొన్ని కీలక ఇన్నింగ్స్ లో భారత్ కు వెన్నెముకలా నిలిచారు. 121 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన మోంగియా.....8028 పరుగులతో దేశవాళీల్లోనూ పరుగుల వరద పారించాడు. మంగళవారంలో ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ప్రాథమిక సభ్యత్వం తీసుకుని పార్టీ కండువా కప్పుకున్నారు.