Minister kanna Babu: సినిమా టికెట్ ధరలను తగ్గిస్తే ప్రేక్షకులను ఎలా అవమానిస్తాం
సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గిస్తే ప్రేక్షకులను అవమానించినట్లు ఎలా అవుతుందని మంత్రి కన్నబాబు హీరో నానిని ప్రశ్నించారు. ధియేటర్ల కంటే బయట కిరాణా షాపులకే ఎక్కువ డబ్బొలుస్తున్నాయన్న నాని కామెంట్ కు మంత్రి కన్నబాబు సమాధానం చెప్పారు. కిరాణా షాపుల వారంటే హీరో నానికి చులకన భావమా అని ప్రశ్నించారు.