Minister Gangula Kamalakar : కరీంనగర్ లో లబ్ధిదారులకు దళితబంధు ఆస్తుల పంపిణీ
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే TRS ప్రభుత్వం దళితబంధును అమలు చేస్తోందని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. కరీంనగర్ లోని బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం వద్ద ఆయన తెలంగాణ దళితబంధు ఆస్తులను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా దళితులకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందన్నారు. 24 మంది లబ్దిదారులకు 10 యూనిట్లుగా... 6 హార్వెస్టర్లు, 3 జేసిబిలు, ఒక డీసీఎం వ్యాన్ పంపిణీ చేశారు. ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి..... వీటిని ఎంపిక చేసుకున్నట్టు మంత్రి వివరించారు. వీటితో లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.