Minister Gangula Kamalakar: కరీంనగర్ లో స్కేటింగ్ రింగ్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్
క్రీడాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో పిల్లల కోసం కొత్తగా నిర్మించిన స్కేటింగ్ రింగ్ ను మంత్రి ప్రారంభించారు. ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి మంత్రి గంగుల కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి గంగుల కమలాకర్ తల్లితండ్రులను కోరారు. క్రీడాకురులను సన్మానించారు.