Minister gangula: మానేరు డ్యామ్ లోని నీరు రైతుల కష్టాలను దూరం చేస్తాయి
గత ప్రభుత్వాల సమయంలో పోలీసు పహార లో విడుదలైన మానేరు డ్యామ్ నీరు ఇప్పుడు స్వేచ్ఛగా పంటలకు వాడుకునే విధంగా మారిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు... కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ నీటి ద్వారా క్రింది వైపు ఉన్న వరంగల్ అర్బన్ రూరల్ తో బాటు, భూపాలపల్లి, ఖమ్మం , మహబూబాబాద్ సూర్యాపేట లకు నీటి విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి పంట కోసం సుమారు తొమ్మిది లక్షల ఎకరాలకు ఉపయోగపడే విధంగా నీటిని విడుదల చేస్తున్నామని... వచ్చే ఏప్రిల్ పదో తారీకు వరకు పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు