Minister Botsa: పీఆర్సీపై చర్చలకు రాని ఉద్యోగసంఘాలపై మంత్రి బొత్స ఆగ్రహం

Continues below advertisement

ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్‌సీ సాధన సమితి వాళ్లు చర్చలకు రాకపోవడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని, వాళ్ళు ఎప్పుడు చర్చకు వస్తామంటే అప్పుడే చర్చిస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీ మరోసారి సమావేశానికి ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామని, వారిలో ఉన్న అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులతో చర్చలకు తాము అందుబాటులో ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని, వాళ్ళు ఎప్పుడు చర్చకు వస్తామంటే అప్పుడే చర్చిస్తామని తెలిపారు. జీతాలు పడితే కదా.. పెరిగేది, తగ్గేది తెలిసేదని, ఎవరికీ కూడా రూపాయి కూడా తగ్గదని మంత్రి స్పష్టం చేశారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram