Megastar Chiranjeevi gift for fan's daughter wedding| అభిమాని కూతురు పెళ్లికి లక్ష
Srikakulam జిల్లా రాజాం కు చెందిన గోక కొండల రావు Chiranjeevi వీరాభిమాని చిన్నప్పటినుండి Chiranjeevi అంటే అమితమైన అభిమానం. Chiranjeevi చేసే సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. తన కుమార్తె wedding నిశ్చయం కావడంతో పెళ్లి పత్రిక లో చిరంజీవి దంపతులు ఫోటోతో పత్రికని ప్రింట్ చేయించాడు. ఎలాగైనా చిరంజీవి కి పత్రికను అందజేయాలని అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడుతో చిరంజీవికి అందచేశారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ వెంటనే స్పందించి ఆయన అభిమాని కూతురు పెళ్ళికి లక్ష రూపాయలు అకౌంట్లో జమ చేసి twitter ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో అభిమాని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అఖిలభారత చిరంజీవి యువత మరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందచేశారు.