Medaram Jathara: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఊపందుకున్న బెల్లం విక్రయాలు

Continues below advertisement

రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో మార్కెట్లో బెల్లం విక్రయాలు ఊపందుకున్నాయి. సమ్మక్క సారలమ్మలకు బెల్లమే బంగారంతో సమానం.అందుకే ఈ జాతరకు వచ్చే భక్తులు నిలువెత్తు బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.మేడారం జాతర వచ్చింది అంటే చాలు బెల్లం రేటు అనూహ్యంగా పెరిగి పోతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో భక్తులు బెల్లంతో పాటు చక్కెరను మొక్కుగా సమర్పిస్తున్నారు.బెల్లం రేటు పెరిగినా అమ్మవార్లకు బంగారం మొక్కు చెల్లించడం తప్పనిసరి అంటున్నారు భక్తులు. మేడారం జాతర సమయంలో ఎక్కువగా మహారాష్ట్రలోని పూణె, నాందేడ్‌ నుండి బెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram