Man Died In Police Custody: బూర్జ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి | ABP Desam
శ్రీకాకుళం జిల్లా బూర్జలో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. భార్య శ్రీదేవి ఆత్మహత్య కేసులో మహేష్ ను కొన్ని రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ పేరుతో పోలీసులు వేధించడం వల్లే మహేష్ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఆందోళన దృష్ట్యా అర్ధరాత్రి బూర్జ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా సిబ్బందిని మోహరించారు.