మహేష్.. రమేష్ కిచ్చిన ఆఖరి నివాళి చూసి ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య... రమేష్ బాబు.. శనివారం రాత్రి మరణించారు. రమేష్ బాబుతో మహేష్ కు మంచి సన్నిహిత్యం ఉండేది. కృష్ణ సినిమాలతో బిజీగా ఉండడంతో.. మహేష్ బాధ్యతలను రమేష్ చూసుకునేవారు. దీంతో అన్నయ్య అంటే మహేష్ కి అమితమైన ప్రేమ. తనకు ఏం కావాలన్నా.. ముందు అన్నయ్య దగ్గరకే వెళ్లేవారు మహేష్. కానీ ఇప్పుడు తనకు కరోనా రావటం వల్ల అన్నయ్యకు ఆఖరిసారి చూడలేని స్థితిలో ఉన్న మహేష్... సోషల్ మీడియా ద్వారా ఆఖరి నివాళులర్పించారు.