Love Problem: ప్రియుడితో పెళ్లి కోసం తూర్పుగోదావరి జిల్లా లో యువతి మౌన పోరాటం
తూర్పుగోదావరి జిల్లా, మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో యువతి మౌన పోరాటం చేస్తోంది. తన బావ పెళ్లి చేసుకునే వరకు పోరాటం ఆగదని చెప్పింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నామని అతడితో వివాహం జరిపించాలంటూ రామానుజమ్మ మౌన పోరాటం చేస్తోంది. ఆమె బావ ఇంటి ఎదుట దీక్ష చేపట్టింది. ఈ విషయమై మలికిపురం ఎస్ఐ హరి కోటి శాస్త్రి వివరణ ఇస్తూ ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ సుబ్బారావు ఈ అమ్మాయిని ప్రేమించలేదని వివరణ ఇచ్చాడని తెలిపారు.