Lord Sriram: భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు ఈ రోజు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండపంలో అర్చకులు వైభవోపేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొవిడ్ నిబంధనల మేరకు ఆలయంలోనే ఊరేగిస్తూ బేడా మండపానికి తీసుకువచ్చారు.