Jawed Habib: ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ పై తీవ్ర వ్యతిరేకత
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ పై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో కేసు నమోదైంది. ఓ స్టైలింగ్ వర్క్ షాప్ లో భాగంగా పూజా గుప్తా అనే మహిళను స్టేజ్ పైకి ఆహ్వానించిన జావేద్ హబీబ్.. ఆమెకు స్టైలింగ్ చేస్తూ, మధ్యలో ఆమె తలపై ఉమ్మాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జావేద్ హబీబ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. మహిళలను అవమానించేలా అతను ప్రవర్తించాడని అంతా దుమ్మెత్తిపోశారు. జాతీయ మహిళల కమిషన్ దీనిపై స్పందిస్తూ.... తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీనికి అనుగుణంగా అతనిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై ఇన్స్టాగ్రాంలో స్పందించిన జావేద్ హబీబ్.... వర్క్ షాప్ ను కాస్త ఫన్ తో నడిపించడానికే అలా చేశాను తప్ప ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరాడు. స్టేజ్ పై జరిగిన ఘటనను సదరు మహిళ పూజా గుప్తా ఓ వీడియో ద్వారా వివరించింది.