Live Life Fraud : ఆన్ లైన్ అప్లికేషన్ మోసంలో లక్షలు పొగొట్టుకున్న బాధితులు
విజయవాడలోని లివ్ లైఫ్ అండ్ నేచురల్ హెల్త్ కేర్ సంస్థ ఆన్ లైన్ లో మోసానికి పాల్పడింది. దాదాపు 18 మంది బాధితులు నుంచి రూ. 17లక్షలు పైగా దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. మెడికల్ పరికరాలను ఆన్‌లైన్ వేదికగా అద్దెకు తిప్పుతూ కొనుగోలు చేసిన వ్యక్తులకు కొంత కాలం షేర్స్ రిటర్న్ చేసిన నేరగాళ్లు ఒక్కసారిగా కనబడకుండా పోయారు. గత కొద్ది రోజులుగా సంస్థ యాజమాన్య ప్రతినిధుల ఫోన్లు పనిచేయక పోవడంతో బాధితులు మోసపోయినట్లు తెలుసుకున్నారు.