Lepakshi Temple : లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ఉన్న గుప్తనిధులు ఎత్తుకెళ్లిపోయారు |
అనంతపురం జిల్లాలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం ఎంతో ప్రఖ్యాతిగాంచినదిగా చెప్పవచ్చు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీరాముని ఆలయంలో ఉన్న గుప్తనిధులు వేటగాళ్ల చేతిలో చిక్కాయి. అతిపురాతనమైన కట్టడాలు, శిఖరాలను ధ్వంసం చేసి గుప్తనిధులను స్థానికులు ఎత్తుకెళ్లారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఏదేమైనా అక్కడ గుప్త నిధులు తీసినట్లు ఆనవాళ్లు కనిపించడంతో గుప్తనిధులు తీసుకెళ్లిన వారిపై చర్యలు తీసుకుంటామని లేపాక్షి ఎస్సై మునీర్ అహ్మద్ తెలిపారు.