Lepakshi Archeological Wonder: అనంతపురం జిల్లా లేపాక్షిలో హైవే నిర్మాణ పనులు...అంతా షాక్

అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధి గాంచిన లేపాక్షి మండల కేంద్రంలోని వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో బయటపడ్డ పురాతన రాతి స్తంభాలు. నేషనల్ హైవే నిర్మాణం పనుల కోసం యంత్రాలతో తవ్వుతుండగా ఆరు అడుగుల పొడవు గల ఎనిమిది పురాతన రాతి స్తంభాలు బయటపడ్డాయి. ఒక్కసారిగా రాతి స్తంభాలు బయటపడడంతో కాంట్రాక్టర్లు రోడ్డు పనులు నిలిపి వేశారు. బయటపడింది పురాతన ఆలయమా లేదా కేవలం స్తంభాలు మాత్రమేనా అన్నది పురావస్తు శాఖ తేల్చాలని లేపాక్షి వాసులుకోరుతున్నారు. ఏదేమైనప్పటికీ లేపాక్షి ఆలయ సమీపంలో పురాతన కట్టడాలు బయటపడటంతో ఇదిఅరిష్టమా లేదా గ్రామానికి మంచికోసమా అన్నదానిపై స్థానికులు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖాధికారులు పర్యవేక్షించేందుకు వస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola