LB Nagar Issue: గంజాయి మత్తులో ఇంటిపై దాడికి దిగిన యువకులు.. ఎమ్మెల్యే అనుచరులమంటూ వార్నింగ్
హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ లో దారుణం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో ఉన్న యువకులు ఓ ఇంటిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదని.. ఎందుకంటే ఎల్బీనగర్ ఎమ్మెల్యే అనుచరులే దాడికి దిగినట్లు కాలనీవాసులు పేర్కొన్నారు.