Lata mangeshkar Passes Away: గానకోకిల లతామంగేష్కర్ అనారోగ్యంతో కన్నుమూత..!| ABP Desam
భారతీయ సినీరంగంలో గానకోకిలగా పేరు తెచ్చుకున్న Latha mangeshkar ఇక లేరు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. Covid రావటంతో జనవరిలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన లతా మంగేష్కర్ ఆరోగ్యం అప్పటి నుంచి క్షీణిస్తూ వచ్చింది. వెంటిలేటర్ పైనే ఇన్నాళ్లూ చికిత్స తీసుకున్నా...కొద్దిరోజుల క్రితం వెంటిలేటర్ తీసివేయటంతో ఆమె ఆరోగ్యం కుదుట పడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తిరిగి ఆరోగ్యం క్షీణించటంతో నిన్న ఆమెను వెంటిలేటర్ అమర్చారు. చికిత్స పొందుతూ లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారు.