Lata Mangeshkar: రాజ్యసభ సభ్యురాలిగా ఒక్క రూపాయీ తీసుకోని లతా మంగేష్కర్ | ABP Desam
దిగ్గజ గాయని, Indian Nightingale Lata Mangeshkar... పార్లమెంట్ సభ్యురాలిగా ఒక్క రూపాయి జీతమూ తీసుకోలేదు. 1999లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. సభా సమావేశాలకు ఆమె రెగ్యులర్ గా హాజరు అవకపోవడం... చాలా విమర్శలకు దారి తీసింది. అనారోగ్యం కారణంగానే రాలేకపోతున్నానని ఆమె చాలా సార్లు వివరణ ఇచ్చుకున్నారు. ఈ పదవిలో ఉన్నన్ని రోజులు ఆమె ఒక్క రూపాయి జీతం, అలోవెన్స్, దిల్లీలో ఇల్లైనా తీసుకోలేదని చెబుతుంటారు.