Lakshya Sen - India Open: ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూను మట్టికరిపించిన భారత యువకెరటం లక్ష్యసేన్

Continues below advertisement

భారత బ్యాడ్మింటన్‌ యువ కెరటం లక్ష్యసేన్‌ అద్భుతం చేశాడు. ఇండియా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రపంచ ఛాంపియన్‌, సింగపూర్‌ షట్లర్‌ లోహ్‌ కీన్‌ యూను 24-22, 21-17 తేడాతో ఓడించాడు. 20 ఏళ్ల ఈ యువ ఆటగాడికి ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్ 500 టైటిల్‌ కావడం ప్రత్యేకం. తొలి గేమ్‌లో లక్ష్యసేన్‌, కీన్‌ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. 2-2, 4-4, 6-6తో సమంగా దూసుకుపోయారు. మ్యాచ్‌ 18-14తో ఉన్నప్పుడు వరుసగా 6 పాయింట్లు సాధించి 20-20తో స్కోరు సమం చేశాడు. గేమ్‌ పాయింట్‌ సమీపించడంతో ఇద్దరూ పట్టువదలకుండా శ్రమించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram