Kurnool Thikkareddy: వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోయాయి
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, తుని నియోజకవర్గాలకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చినరాజప్ప, యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చినరాజప్ప, యనమల రామకృష్ణుడు అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తిక్కారెడ్డిపై వైసీపీ మూకల హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన తెదేపా మాజీ మంత్రులు చిన రాజప్ప, యనమల....ఫ్యాక్షనిస్టులు రెచ్చపోతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే టీడీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు కాపాడలేకపోతే డీజీపీ రాజీనామా చేసి వెళ్లిపోవాలి. గతంలో తిక్కారెడ్డి పై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులపై 1450 దాడులు జరిగితే... 23 మందిని పొట్టన పెట్టుకున్నారని అన్నారు.వైసీపీ దాడులపై న్యాయ విచారణ చేయించి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి తిక్కారెడ్డికి రక్షణ కల్పించాలన్నారు.