Kuna Ravi Kumar: కేంద్ర మాజీ మంత్రి, మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజును పరామర్శించిన శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యకుడు కూన రవికుమార్. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేవాలయాలు నిర్మించిన గజపతి కుటుంబం ఎక్కడ..మీరెక్కడ అంటూ మంత్రి వెల్లంపల్లిపై ఘాటు విమర్శలు చేశారు. ఒక మహోన్నతమైన వ్యక్తిపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్న కూన...హిందూ మనోభావాలను దెబ్బతినేలా దేవాలయాలపై దాడి జరుగుతోందంటూ మండిపడ్డారు.