KMC: వరంగల్ కాకతీయ కాలేజీలో 20 మంది మెడికోలకు కొవిడ్ పాజిటివ్| ABP Desam
వరంగల్ కాకతీయ మెడికల్ యూనివర్సిటీలో కరోనా విజృంభించింది. కేఎంసీలో 195 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 20 మంది మెడికోలకు పాజిటివ్ వచ్చింది. 20 మంది విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ వెల్లడించారు. వీరితో పాటు నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకినట్లు సమాచారం.