KKR-Dhoni Issue: కెప్టెన్ కూల్ పై కేకేఆర్ కాంట్రవర్సియల్ ట్వీట్
Continues below advertisement
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రెడర్స్ ఫ్రాంచైజీ ఓ వివాదంలో చిక్కుకుంది. యాషెస్ సిరీస్ లో నాలుగో టెస్టు ఉత్కంఠభరిత డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆట ఆఖర్లో ఇంగ్లండ్ వికెట్ల కోసం బ్యాటర్ల చుట్టూ ఆసీస్ ఫీల్డర్లను మోహరించింది. టెస్టు క్రికెట్ లో ఇలా జరగడం సర్వసాధారణం. అయితే ఆ ఇమేజ్ ను, కొన్నేళ్ల క్రితం ఐపీఎల్ లో దాదాపు అలాంటి ఫీల్డింగ్ ఎరేంజ్ మెంట్ ఉన్న ఇమేజ్ ను కేకేఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నాడు ఐపీఎల్ లో ధోనీ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు, కేకేఆర్ కెప్టెన్ గంభీర్ ఈ రకంగా ఫీల్డింగ్ పెట్టాడు. రెండింటినీ కంపేర్ చేస్తూ పోస్ట్ పెట్టడంపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎస్కేలో ధోని సహచరుడు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం స్పందించాడు. కేకేఆర్ ది షో ఆఫ్ అని ట్వీట్ చేశాడు.
Continues below advertisement