Kidambi Srikanth: BWF ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి..త్రుటిలో వరల్డ్ ఛాంపియన్ షిప్ మిస్..!
ABP Desam
Updated at:
20 Dec 2021 12:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత బ్యాడ్మింటన్ హీరో కిదాంబి శ్రీకాంత్‌కు అదృష్టం కలిసిరాలేదు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను అతడు త్రుటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అతడు ఓటమి పాలయ్యాడు. సింగపూర్ షట్లర్ లో కీన్ యూ చేతిలో 21-15, 22-20 తేడాతో పోరాడి ఓడాడు. రజత పతకానికే పరిమితం అయ్యాడు. మరో ఆటగాడు లక్ష్యసేన్ కాంస్య పతకం అందుకొన్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒకేసారి ఇద్దరు ఆటగాళ్లకు పతకాలు రావడం విశేషం.