Kidambi Sri Kanth: ఒత్తిడి ఉంటుంది కానీ....వరల్డ్ ఛాంపియన్ షిప్ ను బాగా ఎంజాయ్ చేశా
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో రన్నరప్ గా నిలిచిన తర్వాత టోర్నీ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు కిదాంబి శ్రీకాంత్. ఫైనల్ మ్యాచ్ లో ఒత్తిడి ఉన్నా...గెలిచేందుకు శాయశక్తులా కృషి చేశానన్నారు. ఇప్పటికీ తన బెస్ట్ ఇవ్వలేదన్న శ్రీకాంత్...గత ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఎంత కృషి చేసినా సాధ్యం కాలేదన్నారు. తన శరీరం సహకరించినంత వరకూ బ్యాడ్మింటన్ లో ఉంటానన్న శ్రీకాంత్.....భవిష్యత్ లో మరిన్ని పతకాలు గెలిచేందుకు కృషి చేస్తానన్నారు.