Khiladi Movie : మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్ చేసిన లేటెస్ట్ సినిమా 'ఖిలాడి'
Continues below advertisement
మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్ చేసిన లేటెస్ట్ సినిమా 'ఖిలాడి'. ఇందులో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. మరో రెండు వారాల్లో సినిమా రిలీజ్ కానుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 11న విడుదల చేయాలని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు తెలుగు రిలీజ్ మాత్రమే అనుకున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే, ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.'ఖిలాడి' నిర్మాణ సంస్థల్లో ఒకటైన పెన్ స్టూడియోస్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసే. ఏ స్టూడియోస్‌తో సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. హిందీలో పెన్ స్టూడియోస్‌కు భారీ నెట్‌వర్క్ ఉంది. సినిమా మీద నమ్మకంతో హిందీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే హిందీలో రవితేజకు ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది.
Continues below advertisement