Khammam DCCB Issue: ఖమ్మం జిల్లా ముదునూరులో ఉద్రిక్తత...రుణాలు చెల్లించలేదని ఇళ్ల జప్తు| ABP Desam
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పరిధిలోని ముదునూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రుణాలు సకాలంలో చెల్లించ లేదనే కారణంతో డీసీసీబీ అధికారులు ఉన్నపళంగా పదివేల రూపాయల అప్పుకు 22 వేల రూపాయలు చెల్లించాలంటూ ఇళ్లవద్దకు సామాన్లు జప్తు చేశారు. ఇళ్లకు తాళాలు వేశారు. దిక్కు తోచని స్థితిలో ఇళ్ల ముందే పడిగాపులు కాయాల్సి వస్తోంది అంటూ బాధితులు వాపోతున్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా రుణాలు చెల్లించలేని స్థితిలోకి వెళ్ళమని, కుటుంబ పోషణ భారంగా మారిందని బాధితులు వాపోతున్నారు. రుణాల వసూళ్ల పేరుతో బలవంతంగా తమ ఇళ్లకు తాళాలు వేసి ఇంట్లో ఉండి వెళ్ళగొట్టడం సహేతుకం కాదని వాపోయారు.