Khairtabad Ganesh: భక్తులతో ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సందడి | DNN | ABP Desam

Continues below advertisement

ఖైరతాబాద్ గణేషుడి వద్ద సందడి నెలకొంది. నగరవాసులంతా భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు. గణనాథుడికి ఇరువైపులా త్రిశక్తి మహా గాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం ఇస్తున్నారు. తొలిసారిగా 50 అడుగుల విగ్రహాన్ని సుందరంగా మట్టితో తీర్చిదిద్దారు. ఆనవాయితీగా పద్మశాలీలు పట్టు వస్త్రాలు, యజ్ఞోపవేతం గణేశుడికి సమర్పించారు. ఒగ్గుడోలు, డప్పులు, నృత్యాల మధ్య ర్యాలీగా వచ్చి స్వామివారికి 50 అడుగుల భారీ యజ్ఞోపవేతం సమర్పించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయలు తొలి పూజ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram