KGH Oxygen Plants: థర్డ్ వేవ్ హెచ్చరికల దృష్ట్యా విశాఖ కేజీహెచ్ అప్రమత్తం
రోజురోజుకీ భారీ స్థాయిలో పెరుగుతున్న కొవిడ్ కేసుల దృష్ట్యా విశాఖపట్నంలోని ప్రసిద్ధ KGH హాస్పిటల్ ఆవరణలో PSA ఆక్సిజన్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.వీటి ద్వారా రానున్న రోజుల్లో ఆక్సిజన్ కొరత తో ఏ పేషంట్ కూడా మరణించకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నారు.గత ఏడాది సెకండ్ వేవ్ లో చోటుచేసుకున్న మరణాల దృష్ట్యా ప్రభుత్వాలు అన్నీ థర్డ్ వేవ్ మొదలైంది అంటున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి.ఇక దేశంలోని అన్ని ప్రాంతాలనుండి కనెక్టివిటీ ఉన్న వైజాగ్ నగరంలో కోవిడ్ పేషేంట్ల సంఖ్య పెరుగుతుంది.ఈ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల వరకూ ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు