కెజిహెచ్ హాస్పిటల్ పేరు మార్చడం కాదు, చేతనైతే విశాఖ రైల్యే జోన్ సాధించండి-మంత్రి అవంతి

Continues below advertisement

కెజిహెచ్ హాస్పిటల్ పేరు మార్చడం కాదు , చేతనైతే విశాఖ రైల్యే జోన్ సాధించండి అంటూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు ఏపీ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ . ఏపీకి రైల్వే జోన్ తేవడం చేతకాదు, స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపడం చేతకాదు కానీ పేదల పాలిట గుడి లాంటి కేజీహెచ్ పేరు మారుస్తాననడం హాస్యాస్పదం అన్నారు.దమ్ముంటే పేద రోగులకోసం మరో హాస్పిటలో లేక ఉన్నదాన్లోనే మరో ప్లాంట్ నో కట్టించాలి గానీ .. 150 ఏళ్ల కు పైగా చరిత్ర గల కేజీహెచ్ ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని మంత్రి అన్నారు .ఇక కోవిడ్ కట్టడికోసం ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్న అవంతి శ్రీనివాస్ ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేసారు .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram