Kerala Aycoops: కేరళలో సహకార సంఘాల గొప్పతనానికి నిదర్శనం ఆయ్ కూప్స్
పెట్టుబడి ఖర్చును తగ్గించుకునేందుకు.....సమీకృతంగా పనిచేసి అధిక లాభాలను ఆర్జించేందుకు సహకార సంస్థలు కృషి చేస్తాయి. మీడియా....ఈ ఫైజీ కాలంలో ఈ పేరు తెలియని వాళ్లుండరు. ఎండనకా వాననకా టైం చూసుకోకుండా వార్తల సేకరణలో తలమునకలై పనిచేస్తుంటారు మీడియా ప్రతినిధులు. కానీ వాళ్లకు వచ్చే జీతం మాత్రం అంతంతమాత్రమే. చాలా మీడియా సంస్థల్లో రిటైనర్లుగా, కంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లుగా నామమాత్రపు వేతనాలకు పనిచేస్తుంటారు చాలా మంది జర్నలిస్టులు. మరి వీళ్లకు ఓ మంచి ఆదాయాన్ని కల్పిచటం ఎలా...? కేరళలో ఓ యువ బృందం ఇదే ఆలోచన చేసింది. కేరళలోని పునలూరులో మహమ్మద్ షఫీ అనే యువకుడు...సరికొత్త ఆలోచన చేశాడు. కేరళలోనే అంతెందుకు దేశంలోనే మొట్టమొదటి కో-ఆపరేటివ్ మీడియా ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించాడు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు వయస్సున్న ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ రైటర్లు, ఎడిటర్స్, మ్యూజీషియన్స్, సింగర్స్, డైరెక్టర్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, సౌండ్ ఇంజినీర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ లకు ఒకే వేదిక కల్పించి... దానికి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ యూత్ కో ఆపరేటివ్ సొసైటీ- ఆయ్ కూప్స్ అని నామకరణం చేశారు.