Karimnagar Best Village :అత్యుత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం

Continues below advertisement

ఉమ్మడి జిల్లాల కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామం కేంద్ర ప్రభుత్వం చేత అత్యుత్తమ గ్రామంగా గుర్తింపబడింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెద్దపల్లి భవాని అరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో 80 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడంతో అత్యున్నత గ్రామ పంచాయతీగా గుర్తింపు లభించిందని తెలిపారు. అలాగే సొంత ఖర్చుతో బాలవికాస ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులు ఉండగా నేడు ఆ సంఖ్య 135 విద్యార్థులకు చేరిందన్నారు. కొండాపూర్ గ్రామం లో ఇంటింటికీ నల్లా కనెక్షన్, మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, 90 శాతం పూర్తి అయ్యాయని, తడి చెత్త, పొడి చెత్తను, వేరు ఎరువులు తయారు చేస్తున్నామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola