Kamareddy Collector|కామారెడ్డి మాస్టార్ ప్లాన్ పై స్పందించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ | ABP
కామారెడ్డి మాస్టార్ ప్లాన్ గొడవపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తొలిసారిగా స్పందించారు. పట్టణ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రాథమిక దశలో ఉందని.. ఇందుకోసం డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారని తెలిపారు. ముసాయిదాలో అభ్యంతరాలకు నవంబర్ 13వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు 60 రోజులు సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. రైతులు తమ భూములు పోతున్నాయనే అపోహలు పెట్టుకోవద్దని సూచించారు...