Kaleswaram Project : కాళేశ్వరం పంపుహౌస్ లో రూ. 10 లక్షలు విలువైన సామగ్రి మాయం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద నిర్మించిన పంపుహౌస్ లో చోరి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాచ్ మెన్ల సహాయంతో కన్నేపల్లి, కాళేశ్వర గ్రామాలకు చెందిన వ్యక్తులు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సుమారు రూ. 10 లక్షల విలువైన సామగ్రిని మహారాష్ట్ర లోని సిరోంచ, మహాదేవపూర్, భూపాలపల్లికి విక్రయించినట్లు అనుమానిస్తున్నారు. సబ్ స్టేషన్ కు సంబంధించిన సామాన్లు చోరీ కాగా గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు విచారణ చేపడుతున్నారు.