Kakinada Flag : దేశ ప్రజలందరికీ కనీస సౌకర్యాలు, సమాన అవకాశాలు దక్కాలన్న సిఐటియు
త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకుందాం అంటూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) ఆధ్వర్యంలో కాకినాడ లో 75 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్ జిల్లా గ్రంథాలయం వద్ద సిఐటియు ఆలిండియా ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణి జాతీయ పతాక ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో, ఎన్నెన్నో పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని నేటితరం కాపాడుకోవాలని సిఐటియు కోరుతోందన్నారు.