Kadapa Temples Rush : న్యూ ఇయర్ సందర్భంగా భక్తుల రద్దీతో పలు ఆలయాలు పోటెత్తాయి

Continues below advertisement

భక్తుల రద్దీతో పలు ఆలయాలు పోటెత్తాయి. నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని భావిస్తూ భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కిటకిటలాడింది. కొత్త ఏడాది నూతనోత్సహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. నూతన సంవత్సరం రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సుఖసంతోషాలతో జీవించగలమని ఆకాంక్షించారు.. కరోనా, ఒమిక్రాన్ వైరస్ నుంచి రక్షించాలంటూ ప్రార్థన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. తరలివచ్చిన భక్తులకు తిరుమల లడ్డులను పంపిణీ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram