Kabaddi: తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రేపే ఫైనల్స్
తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన... పోటీల నిర్వహణలో ఏమైనా తప్పులు చేసుంటే నగరవాసులు మన్నించాలని కోరారు. లక్షన్నర రూపాయలు ఇద్దామనుకున్న మొదటి స్థాన బహుమతిని ఇప్పుడు దాతల సాయంతో రెట్టించి అందిస్తున్నామన్నారు. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, నారాయణస్వామి, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు.