JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీ రద్దు-గాంధీ విగ్రహానికి పూలమాలలు
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా బీజేపీ ర్యాలీని రద్దు చేసింది. తొలుత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లోని సికింద్రబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు క్యాండిల్ ర్యాలీని బీజేపీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గోనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చారు. జేపీ నడ్డాకు జాయింట్ సీపీ కార్తికేయ ఎయిర్ పోర్టులోనే కోవిడ్ నిబంధనల గురించి వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. అందుకు జేపీ నడ్డా స్పందిస్తూ బాధ్యత గల పౌరుడిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తానని చెప్పారు. జేపీ నడ్డా ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారని నడ్డా అన్నారు. కరోనా నిబంధనలు ఉన్నాయని తెలిపారు. తాను అన్ని కరోనా నిబంధనలు పాటిస్తానని వారికి చెప్పానని పేర్కొన్నారు. సికింద్రబాద్ లోని గాంధీ విగ్రహానికి నివాళుల అర్పిస్తాన్నారు. అరెస్టు చేస్తే అప్పుడు చూద్దాం అంటూ ఆయన సికింద్రాబాద్ బయలుదేరారు.