Jayashankar Bhupalpally Rains- వడగళ్ల వానకు విరిగిపోయిన మిర్చి మొక్కలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కురిసిన అకాల వర్షం రైతులను నట్టేట ముంచేసింది. తెల్లవారుజాము వరకు కురిసిన వానకు చాలా చోట్ల వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వానకు మిర్చి తోటలో మొక్కలు విరిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. వానల వల్ల ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లోకి వరదనీరు చేరి బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. నష్టానికి అంచనా వేసి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.